Nirmal district schools colleges holiday heavy rains
Nirmal district schools colleges holiday heavy rains

Nirmal district schools colleges holiday heavy rains: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal district schools colleges holiday heavy rains: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (బుధవారం) నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడం, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోవడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. రేపు (ఆగస్టు 20) జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132లో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *