Prajavani
Prajavani

Prajavani: అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Prajavani: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. రెవెన్యూ శాఖకు 58, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 20, ఎస్‌డీసీకి 10, ఎస్పీకి 7, విద్యా శాఖ, జిల్లా పంచాయతీ అధికారికి 4 చొప్పున, ఎల్‌డీఎం, వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి, ఉపాధి కల్పన శాఖకు 3 చొప్పున, డీసీఎస్ఓ, జిల్లా సంక్షేమ అధికారి, ఎంపీడీవో కొనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లికి రెండు చొప్పున, ఎంపీడీవో ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభిరావుపేట చందుర్తి, ఇరిగేషన్, జిల్లా వైద్యాధికారి, వ్యవసాయ అధికారి, డీఎం డబ్ల్యూఓ, సెస్, డీటీడబ్ల్యూఓ, హ్యాండ్ లూం అండ్ టెక్స్టైల్స్, డీపీఆర్ఈ, డీఎస్‌సీడీఓ, ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ సిరిసిల్ల, డీబీసీడీఓ ఒకటి చొప్పున మొత్తం 142 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *