ఖానాపూర్ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు
Khannapur development fund Rs 15 crore Telangana CM Revanth Reddy: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపెల్లి కృష్ణారావ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటాలకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేసి, టపాలయాలు పేల్చి, స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు దయానంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వార్డుల్లో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేసేందుకు అలాగే కుంటల సుందరీకరణకు మున్సిపాలిటీకి ఒక జేసీబీ, వీధి దీపాల మరమ్మత్తులకు, లాంగ్ లాడర్ కొనుగోలు కోసం రూ.15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులకు కృతజ్ఞత పూర్వకంగా పాలాభిషేకం చేశామని, పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ అన్ని వార్డుల్లో రోడ్లు డ్రైనేజీల సమస్యలపై చిత్తశుద్ధితో కృషి చేసి ప్రతి వార్డుకు సుమారు 70 నుంచి 80 లక్షల నిధులతో అభివృద్ధి జరిగే విధంగా నిధులు మంజూరు చేయటం నిదర్శనం అని అన్నారు. కొత్త మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద తీసుకొని అనేక పనులు చేయటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అబ్దుల్ మజిద్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, పార్టీ జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేశ్ నాయకులు అంకం రాజేందర్, కావాలి సంతోష్, కిశోర్ నాయక్, కుర్మా శ్రీను, జన్నారపు శంకర్, పరిమి సురేశ్, అమనుల్లా ఖాన్, గంగ నర్సయ్య, జహీర్ అహ్మద్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, మడిగేలా గంగాధర్, జంగిలి శంకర్, మదిరే సత్యనారాయణ, కముటం రవి, శేషాద్రి, రాజేందర్, లక్ష్మీనారాయణ, నర్సయ్య, హరి, మైస శ్రీనివాస్, నయీమ్, జూని,
ఖుర్షీద్, జియా, రాము తదితరులు పాల్గొన్నారు.