Vishwakarma Jayanti Celebrations Nirmal: నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.