కాడి రకం 12,666, గోల రకం10,666
Turmeric purchases begin:ఇబ్రహీంపట్నం, జనవరి 31 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్‌కు చెందిన పలువురు అడ్తిదారులు దుకాణలను ప్రారంభం చేయగా రైతులు పసుపు విక్రయించారు. కాడి గరిష్ఠం రూ.12,666, కనిష్ఠం రూ.7 వేలు, గోల కనిష్ఠం రూ.10,666, గరిష్టం రూ.7 వేలు, చూర కొమ్ము కనిష్ఠం రూ.10122, గరిష్ఠం రూ.9,566 ధరలు పలికాయి. అనంతరం ఎస్ ఎంసీ చైర్మన్ కున గోవర్ధన్‌ను పలువురు అడ్తిదారులు, ఖరీద్ దారులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పుల్లూరి నవీన్, అనంతరెడ్డి, గంగాధర్, వ్యాపారస్తులు పుల్లూరి రాములు, మహాజన్ నర్సింలు, జెట్టి లింగం, సామ బుచ్చయ్య, ఎల్మి శంకరయ్య, పుల్లూరి సతీశ్, గుంటుక రవి, మహాజన్ శివకుమార్, ముక్క హరీశ్, గోపిడి శ్రీనివాస్ రెడ్డి, ఎల్మి రవి మార్కెట్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.