Students regular attendance Government Junior College Lokeshwaram
Students regular attendance Government Junior College Lokeshwaram

Students regular attendance Government Junior College Lokeshwaram: విద్యార్థులు కళాశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలి

ప్రభుత్వ కళాశాలలో పోషకులు, అధ్యాపకుల సమావేశం

Students regular attendance Government Junior College Lokeshwaram: మండల కేంద్రంలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ గౌతమ్ ఆధ్వర్యంలో పోషకులు, అధ్యాపకుల సమావేశాన్ని నిర్వహించినారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుంచి విద్యార్థుల తల్లితండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల పట్ల తల్లితండ్రులు అనుసరించాల్సిన బాధ్యతలు అధ్యాపకులు తెలయజేశారు. పోషకుల యొక్క సలహాలు, సూచనలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని, సుమారు రూ.6 లక్షలతో అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్యర్యంలో వసతులను సమకూరుస్తుందని తెలిపారు. విద్యార్థుల తరగతి గదులలో ప్రత్యేక నిఘా కెమెరాలు బిగించడంతోపాటు ఫేషియల్ అటెండెన్స్ ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతి విద్యార్థికి పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. పోషకులు ప్రభుత్వ కళాశాలల పట్ల చిన్న చూపు వీడాలని సూచించారు. ప్రతి నిత్యం విద్యార్థులు కళాశాలకు హాజరయ్యాలా తల్లి తండ్రులు పూర్తి భాధ్యత వహించాలని ప్రిన్సిపల్ గౌతమ్ సూచించారు. సమావేశంలో అధ్యాపకులు వివిధ గ్రామాల విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *