Gram Sabha
Gram Sabha

Gram Sabha: పథకాలకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Gram Sabha: ఎల్లారెడ్డిపేట, జనవరి 22 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డులు అర్హులందరికీ  అందిస్తామని, దరఖాస్తులు సమర్పణకు చివరి తేదీ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని, అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డ్ సభలకు ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీకారం చుట్టగా, బుధవారం ఎల్లారెడ్డి పేట మండలం పదిర గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. అర్హులందరికీ ఆయా పథకాలు అమలు చేస్తామని, గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు అర్జీలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామచంద్రం, ఎంపీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *