Selection of disabled beneficiaries: నిర్మల్, అక్టోబర్ 18 (మన బలగం): కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలోని జిల్లా స్క్రీనింగ్ కమిటీ, అర్హులైన వికలాంగులకు రిట్రోఫిటెడ్ మోటరజ్డ్ వాహనాల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. అధికారులు లబ్ధిదారుల ఎంపికకు హాజరైన వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, వికలాంగులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.