Christmas celebrations
 Christmas celebrations

Christmas celebrations: గొల్లపేట్‌లో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

 Christmas celebrations: నిర్మల్, డిసెంబర్ 25 (మన బలగం): ఏసుక్రీస్తు జీవితం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్‌లోని ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చి పాస్టర్ లాజర్ ఏసుక్రీస్తు సందేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ అని ఏసుక్రీస్తు జన్మించిన శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని అభిలాషించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపి కేక్ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిని రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై పెర్సిస్, సంఘస్తులు దినకర్, ప్రకాష్, ఏసుదాస్, శంకర్, దినేష్, రాజేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *