Nagajyoti as District Education Officer: నిర్మల్, నవంబర్ 4 (మన బలగం): నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా నాగజ్యోతిని నియమిస్తున్నట్లు రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఇక్కడ డీఈవోగా పనిచేసిన రవీందర్ రెడ్డిని మహబూబాబాద్ జిల్లా డైట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. నిర్మల్ డీఈవోగా బదిలీపై వస్తున్న నాగజ్యోతి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్, డీఈవోగా పనిచేశారు. నిర్మల్ జిల్లా డీఈవోగా నాగ జ్యోతి బదిలీపై వస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కొంతకాలంగా ఉపాధ్యాయులపై బిట్ కాయిన్ భూతం నీలి నీడలా కమ్ముకుంది. పది ఫలితాలలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ వరుసగా ఉపాధ్యాయులు అరెస్టుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై జిల్లా వాసులు నమ్మకాన్ని కోల్పోయారు. మరి ఇలాంటి సమస్యల వలయాన్ని దాటి నూతనంగా వస్తున్న డీఈవో జిల్లాలో 10 ఫలితాలను మళ్లీ పునరావృతం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.