KTR gift: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 12 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గిఫ్ట్ ఏ స్మైల్ ప్యాడ్, పెన్నులను మండల ప్రజా ప్రతినిధులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉన్నత స్థానంలో ఎదగాలని కెటి రామారావు ఆల్ ది బెస్ట్ తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం,మాజీ జెడ్పి కోఆప్షన్ చాంద్ పాషా ,స్థానిక బిఆర్ఎస్ నాయకులు సురేష్ నాయక్ , శ్రీరామ్ నాయక్ తిరుపతి నాయక్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.