Holi celebrations: తానుర్, మార్చి 13 (మన బలగం): వాసవి పాఠశాలలో ముందస్తు హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాసవి స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ హోలీ. సుఖం, దుఃఖం, సంతోషం, విచారం అన్ని కలిసిన రంగులే హోలీ అని, రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే పండుగ హోలి అని తెలిపారు. కార్యక్రమంలో వాసవి స్కూల్ డైరెక్టర్ నర్సయ్య, ఉపాధ్యాయులు సుధీర్, ప్రియాంక, పుష్పశ్రీ, పూజ, నవనీత, సీమ నీరజ, రూప అఖిల, ప్రతిక్ష, కోమల్ విద్యార్థి మరియు విద్యార్థినులు పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
