Kondagattu: మల్యాల, మార్చి 23 (మన బలగం): మల్యాల మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా క్యూ లైన్లు, ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు, స్నానపు గదులు, సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జయంతి జరిగే 3 రోజుల పాటు మండల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ శ్రీకాంత రావు, జిల్లా ఎస్పే అశోక్ కుమార్, డీఎస్పీ, ఆర్‌డి.వో, డిపీవో, మల్యాల ఎమ్మార్వో మునిందర, ఎంపిడివో స్వాతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి, ఎస్సై నరేష్ కుమార్, సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.