Free medical camp: నిర్మల్, నవంబర్ 23 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని సోపినగర్‌లో శనివారం హ్యాండ్ ఆఫ్ హోప్ అండ్ రెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో కాలనీవాసులకు ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైద్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.