Request to release PRC: మెట్‌పల్లి (ఇబ్రహీంపట్నం), అక్టోబర్ 28 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం తపస్ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌మహమ్మద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మిగిలిన 4 డీఏలు, 2023 జూన్ నుంచి రావాల్సిన పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర నాయకులు ఎస్‌పీ లింబగిరి స్వామి, జిల్లా నాయకులు అంకతి లింగారెడ్డి, ర్యాగల్ల మహేశ్, మెట్‌పల్లి మండల అధ్యక్షులు నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి మహేశ్, జయేందర్, మనోజ్, రాజ్‌కుమార్, సతీశ్, శ్యామ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.