Valmiki Maharshi Jayanti: నిర్మల్, అక్టోబర్ 17 (మన బలగం): యావత్ భారత జాతి గుర్తుంచుకునే వాల్మీకి మహర్షి జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మరించుకోవడం గర్వించ దగిన దినమని జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ దినం జాతి గుర్తుంచుకునే రోజు, రామాయణాన్ని రచించింది ఒక బోయ కులానికి చెందిన వాల్మీకి. మహర్షి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారని అన్నారు. రామాయణం, మహాభారతం సారాంశాలను ఈ తరం విద్యార్థులకు తెలియజేయాలనీ, ఇలాంటి గొప్ప వారి చరిత్రలను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజేశ్వర్ గౌడ్, సిపిఓ జీవరత్నం, డిఎస్ఓ కిరణ్ కుమార్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.