Minister Sitakka: తానూర్, జనవరి 6 (మన బలగం): తానూర్ మండలాన్ని రెండు మండలాలుగా విభజించాలని గత ప్రభుత్వ హయాంలో బెల్‌తరోడా గ్రామాన్ని మండలంగా జీవోను విడుదల చేసింది. కానీ ఇప్పటివరకు మండలాన్ని ప్రకటించలేదు. కాబట్టి నూతనంగా బెల్‌తరోడా గ్రామాన్ని మండలంగా వెంటనే ప్రకటించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి, మంత్రి సీతక్కకు మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో సోమవారం తానూర్ మండలం మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, అటల్ దేవదాస్ వినతిపత్రం సమర్పించారు. బెల్‌తరోడా గ్రామాన్ని మండలంగా వెంటనే ప్రకటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 11 మండలాలను నూతనంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారని, అందులో బెల్‌తరోడాను చేర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.