Day of Persons with Disabilities: నిర్మల్, డిసెంబర్ 3 (మన బలగం): జిల్లాలో వికలాంగుల సంక్షేమం కొరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని యోగా కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు అన్ని విధాలా సేవలు అందించబడుతాయని, పైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఉపయోగపడే వెస్టర్న్ కామెడిస్ మ్యాన్ కైండ్ వారి ఆర్థిక సాయంతో, లేప్ర ఇండియా సారథ్యంలో అందించడం జరిగిందని, అదేవిధంగా సత్య సాయి సేవ సమితి వారి సహకారంతో వికలంగులందరికి బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో వికలాంగులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్, డీపీఎంఒ రాజేశ్వర్, లేప్ర సొసైటీ సంస్థ ఫిజియోథెరపీస్ట్ కిషన్ రావు, సత్యసాయి సేవాసమితి సభ్యులు,వికలాంగులు పాల్గొన్నారు.