Dharmapuri: ధర్మపురి, నవంబర్ 15 (మన బలగం): కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురిలోని స్థానిక బ్రహ్మపుష్కరిణిలో నిర్వహించిన పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుష్కరిణిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి దీపాన్ని వెలిగించారు. అనంతరం గోదావరిలో నిర్వహించిన గంగా హారతి మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.