KALKI: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. సినిమా విడుదలై దిగ్విజయంగా రెండు వారాలు పూర్తిచేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. హాలివుడ్ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బుజ్జి కారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఏదో తెలియని కొత్త అనుభూతిని కలగజేస్తుంది. సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు కొల్లగొడుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతు స్విచుయేషన్ చూస్తే ఓటీటీలోకి రావడానికి తక్కువ రోజులే ఉందని తెలుస్తోంది. ఓటీటీలో ఫస్ట్ హిందీ భాషలో రిలీజ్ చేసి, తరువాత తెలుగు, ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశముంది. ప్రభాస్ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్నట్లు సమాచారం.