Vishwak Sen movie Laila: ఇది నిజంగా సర్ ప్రైజింగ్, డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ప్రస్తుత హీరోలు లేడీ క్యారెక్టర్ చేయడానికి సాహసించరు. డిఫరెంట్ జానర్‌ల చిత్రాలను చేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి నిర్మిస్తున్న తన లేటెస్ట్ మూవీ ‘లైలా’లో మ్యాన్ అండ్ విమన్ పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వక్సేన్‌ను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో చూపించడానికి బలమైన స్ర్కిప్ట్‌ను రూపొందించారు. కఠినమైన, సాహసోపేతమైన క్యారెక్టర్‌ను అంగీకరించాలంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలెంజ్‌గానే ఉంటుంది.
బుధవారం మేకర్స్ లైలా ఐ లుక్‌ని విడుదల చేశారు. విశ్వక్ సేన్ లైలాగా ఛార్మింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. విశ్వక్సేన్‌కి ఇది బ్యూటిఫుల్ మేక్ఓవర్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అతను పర్ఫెక్ట్‌గా విమన్ లా కనిపించిన లుక్ అదిరిపోయింది. ఫిమేల్ క్యారెక్టర్‌లో విశ్వక్‌లా మరెవరూ కనిపించి ఉండరనడంలో అతిశయోక్తి కాదు. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు. ఐస్ మూవ్‌మెంట్ లేడీస్‌లా చేయడం అందరివల్లా కాదు. దీన్ని విశ్వక్సేన్ పర్ఫెక్ట్‌గా చేసి చూపించారు. వెండితెరపై లైలాగా విశ్వక్సేన్ కంప్లీట్ ఫేస్‌ను చూసేందుకు మరింత ఆతృత పెంచింది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని బుధవారం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచాన్ చేసి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలు వెంకట సతీశ్ కిలారు, జెమినీ కిరణ్ మేకర్స్‌కి అందజేశారు.
హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. లైలా సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు.
రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా వ్యవహరిస్తున్నారు. వాసుదేవ మూర్తి రైటర్. తనిష్క్ బాగ్చి, జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం ప్రజెంట్ చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
‘లైలా’ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: తనిష్క్ బాగ్చి, జిబ్రాన్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: అన్వర్ అలీ
మార్కెటింగ్: ఫస్ట్ షో