Kannappa: మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీకి ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహిస్తు్న్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారగణంతో వస్తున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా మంచు విష్ణు పెట్టిన పోస్ట్‌తో రిలీజ్ డేట్‌పై కారిటీ వచ్చేసింది. ‘డిసెంబరు 2024’ అని విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీని కన్నప్ప హ్యాష్‌ట్యాగ్ అని జోడించారు. త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ మూవీ సైతం డిసెంబర్ నెలలోనే 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ‘కన్నప్ప’ మూవీని ఆ తరువాత అంటే డిసెంబర్ మూడో లేదా నాలుగో వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పాన్ ఇండియా మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ తదితరులు ఈ మూవీలో కనిపించనున్నారు. విష్ణు తిన్నడు పాత్రలో కనిపించనున్నారు. అధిక భాగం షూటింగ్ న్యూజిలాండ్‌లో నిర్వహించారు. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్ బాబు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన ఓ కీలక పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమా టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఇటీవల సోషల్ మీడియాలోనూ విడుదల కాగా ప్రేక్షకాదరణ లభిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేశారు. వీటిని చూసిన అభిమానులు హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విష్ణు భారీ సాహసమే చేస్తున్నాడని చెప్పాలి. డిసెంబర్‌ను బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మూవీస్ చాలానే రిలీజ్ కానున్నాయి. ఇదే నెలలో పుష్ప ది రూల్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు పోటీగా కన్నప్పను రిలీజ్ చేయడం సాహసంతో కూడుకున్న పని అని, ఇది కన్నప్ప కలెక్షన్స్‌పై ప్రభావం చూపే ప్రమాదముందని సినీ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. అయితే కన్నప్ప విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.