- ఈద్గాను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
RAMZAN PRAYER PLACE: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఈదిగాంలో ఉన్న ఈద్గా మైదానం (ప్రార్థన మందిరం)ను మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఎస్పీ గంగారెడ్డి సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ఈదిగాంలోని ఈద్గా మందిరం కు ముస్లిములు ప్రార్థన చేయుటకు వస్తుంటారు. కావున ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యుత్, శానిటేషన్, మంచినీరు, టెంట్స్, ట్రాఫిక్, అన్ని రకాలుగా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. కౌన్సిలర్లు-విప్ వేణు, తారక వాణి రఘువీర్, అబ్దుల్ మతిన్, అన్వర్ పాషా, రాజు, శివ, పలువురు సంబంధిత, అధికారులు, ఉన్నారు.