Job Placement: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. శనివారం జాబ్ మేళా ఫ్లెక్సీని కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్టినెంట్ డాక్టర్ జె.భీమా రావు, అధ్యాపకులు ఆవిష్కరించారు. జియో మరియు ముత్తుట్ ఫైనాన్స్ కంపెనీలలో బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. సోమవారం ఉదయం 9 గంటలకు స్థానిక డిగ్రీ కళాశాలలో నమోదు కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.భీమారావు, టీఎస్కేసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ శంకర్, కళాశాల ప్లేస్మెంట్ అధికారి, యు.రవి కుమార్ టీఎస్కేసీ మెంటర్ బి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9963728452, 9963497349 సంప్రదించాలని సూచించారు.