Babu Jagjivan Ram Jayanti: భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాన్ని నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో రాజేశ్వర్, డీఆర్డీవో భుజంగరావ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.