ACB Raid
ACB Raid

ACB Raid: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ

ACB Raid: తెలంగాణ బ్యూరో /మన బలగం: మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. హైదరాబాద్ గచ్చిబౌలి సబ్ డివిజన్‌లోని ఏడీఈ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏడీఈ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. టీజీఎస్‌పీడీసీఎల్ గచ్చిబౌలి సబ్ డివిజన్‌లో కొట్టె సతీశ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్, సీటీ మీటర్ ఏర్పాటు కోసం బాధితుడిని ఏడీఈ రూ.75 వేలు డిమాండ్ చేశారు. ఇదివరకే రూ.25వేలు ఏడీఈ తీసుకున్నారు. మరో దఫా రూ.50 వేలు బాధితుడి నుంచి తీసుకుంటుండగా ఏడీఈ సతీశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *