DHPS: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎవరికి అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని DHPS జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ అన్నారు. కరీంనగర్ జిల్లా ముఖ్యుల సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో DHPS జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అశోక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఇండస్ట్రియల్ లోన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్, చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి గ్రామ మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభ్యత్వాలు చేర్పించు కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ నాయకులు పార్నంది రాజకుమార్, బోయిని పటేల్, మహిళ నాయకురాలు శారద ఎస్.నాంపల్లి, అందే సంపత్, అందే వెంకట్, ఏ పుల్లయ్య, రాజు, సంపత్ పాల్గొన్నారు.