Jyeshtha Lakshmi Devi Puja celebrations Nirmal: జేష్ఠ లక్ష్మీదేవి పూజను ఆదివారం నిర్మల్ పట్టణంలోని దివ్య నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు సదాశివశర్మ నివాసంలో లక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి వైభవోపేతంగా పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడు జేష్ఠ లక్ష్మీదేవి పూజను భాద్రపద శుక్ల అష్టమి రోజున నిర్వహించుకుంటున్నట్లు సదాశివశర్మ తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారికి అన్న ప్రసాద వితరణ చేశారు.
