- ప్రమాదవశాత్తు గోదావరిలో పడిన మేకల కాపరి
Goatherd survives accident in Godavari floods Nirmal: ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కడెం మండలంలోని ధర్మాజిపేట్ గ్రామానికి చెందిన మల్లయ్య 20 సంవత్సరాల నుంచి బాదనకుర్తిలో మేకల కాపరిగా పని చేస్తున్నాడు. ఆదివారం ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి గోదావరి ప్రవాహానికి కొట్టుకపోగా అక్కడే ఉన్న కొందరు ఆయనను ఒడ్డుకు రా అని కేకలు వేశారు. గోదావరిలో ప్రవాహానికి కొట్టుకపోతున్న ఆయన ఈదుకుంటూ మలుపు ప్రాంతంలో ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న వారితోపాటు మల్లయ్య ఊపిరి పీల్చుకున్నాడు. మృత్యు ఒడిలోకి వెళ్లిన మల్లయ్య ఒడ్డుకు చేరుకోవడంతో హమ్మయ్య బతికి బయటపడ్డాను అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.