MBBS student Spandana honored by IPS officer Bhukya Ram Reddy in Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో ఇటీవల నీట్లో ఉత్తీర్ణత సాధించి తొలి రౌండ్లోనే ఎంబీబీఎస్ సీటు పొందిన నలిమేటి నాగరాజు సుజాత గార్ల కుమార్తె కుమారి నలిమేటి స్పందనను ఐపీఎస్ అధికారి, భూక్యా రాంరెడ్డి ధూమా నాయక్ ట్రస్ట్ చైర్పర్సన్ భూక్యా విజయతో కలిసి స్పందనకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. భూక్యా రాంరెడ్డి మాట్లాడుతూ, స్పందనను స్ఫూర్తి తీసుకొని యువత పోటీ ప్రపంచంలో గెలవాలన్నారు. గర్జనపల్లి గ్రామాన్ని పతాక స్థాయిలో నిలబెట్టింది అన్నారు. ఇప్పుడున్న యువత గంజాయి లాంటి వ్యసనాలకు బానిసలు అయి జీవితాలు దుర్భరం చేసుకుంటున్నారని, వారికి స్పందన లాంటి అమ్మాయిలు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు. ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు. ధూమా నాయక్ ట్రస్ట్ చైర్ పర్సన్ విజయ మాట్లాడుతూ, డాటర్స్ ఆర్ నాట్ టెన్షన్.. డాటర్స్ ఆర్ ఈక్వెల్ టు టెన్ సన్స్ అని అన్నారు. మా ట్రస్ట్ ద్వారా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. వీర్నపల్లి ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ, స్పందన లాంటి అమ్మాయి నేటి యువతకు ఎంతో ఆదర్శం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాకేశ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివిన అమ్మాయి ఈ విధంగా సీటు సాధించడం గొప్ప విషయం అని అన్నారు. బీఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ మాట్లాడుతూ, తమ గ్రామానికి తొలి డాక్టరమ్మ కావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. బాబాసాహెబ్ స్ఫూర్తితో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ముందు.. ముందు గొప్ప స్థాయికి వెళ్లాలని మా గ్రామానికి మంచి పేరు సాధించి పెట్టాలని కోరారు.
ఈ సందర్భంగా స్పందన మాట్లాడుతూ, ఈ యొక్క స్ఫూర్తితో వైద్య విద్యా పూర్తి కాగానే పేద ప్రజలకు నా యొక్క సేవలు అందిస్తానని మాటిచ్చారు. వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చగారి రాకేశ్ గౌడ్ రైజింగ్ స్టార్ యూత్‌కు వాలీబాల్ నెట్, వాలీబాల్‌ను ఎస్పీ రాంరెడ్డి చేతుల మీదగా బహూకరించారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్, అంబేడ్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు గజ్జెల రెడ్డి, ప్రధాన కార్యదర్శి దావ పోచయ్య, మానువాడ భూమయ్య, మల్యాల నరేశ్ కుమార్, సంకటి అజయ్ కుమార్, మానువాడ ప్రశాంత్, డాక్టర్ మహిపాల్, ఏఎంసీ డైరెక్టర్ సంతోష్ నాయక్, ప్రకాష్ నాయక్, రైజింగ్ స్టార్ యూత్ ప్రెసిడెంట్ మాంకాళి మహిపాల్, నగరపు దేవేందర్, నలిమేటి నాగరాజు, సుజాత, న్యాత వినోద్, శేఖర్, దిలీప్, మహంకాళి సంతోష్, జుట్టు సురేష్, రాజు, బాలకిషన్, ఉపేందర్, మైకేల్, చంద్రకాంత్, ప్రశాంత్, అనిల్, రాజయ్య, నగేష్, వెంకటేశ్ పాల్గొన్నారు.
