Good touch-bad touch: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 26 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్ పాఠశాల నందు మహిళా శిశు సంక్షేమ శాఖ. మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, 100, 1098, 1930 హెల్ప్‌లైన్ నెంబర్లను, పోక్సో, చట్టం గురించి, స్వీయ రక్షణ గురించి మహిళా సాధికారత కోఆర్డినేటర్ రోజా విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మొబైల్స్ ఎక్కువ వాడడం వల్ల వివిధ రకాలైన సైబర్ వలలో పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున మొబైల్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వివిధ రకాల వ్యసనాలకు గురికావడం వలన మానసిక ఒత్తిడి లను ఎదుర్కొంటున్నారని, అలా కాకుండా విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతతో మెలగాలని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఉన్నత స్థాయి చదువులు అభ్యసించాలని, ఉన్నతంగా ఉండాలని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సరిత, ప్రతాప్ కుమార్, రవి, రామస్వామి మరియు జనరల్ స్పెషలిస్ట్ దేవిక, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.