Ganganala: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరుతో గంగానాల ప్రాజెక్టులోకి చేరడంతో జలకళను సంతరించుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్వం 1959లో గంగానాల ప్రాజెక్టును రెండు మీటర్ల ఎత్తుతో ఉన్న కాలువ భాగంపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు రావడంతో గేట్లు ఎత్తడంతో పాటు మూలరాంపూర్, సదర్‌మాట్ బ్యారేజీ సైతం గేట్లు ఎత్తారు. దీంతో గోదావరి పోటెత్తుతోంది. ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి, యామపూర్, ఫకీర్‌కొండాపూర్, మల్లాపూర్ మండలంలోని నడికుడ, మొగిలిపేట, ఓబులాపూర్, సంఘెశ్రీరాంపూర్, ధాంరాస్‌పల్లి గ్రామాల శివారు వరకు 4వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. గంగానాలకు భారీగా నీరు రావడంతో ఆయకట్టు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.