Uruku Patela
Uruku Patela

Uruku patela: తేజస్‌ కంచర్ల విభిన్నమైన చిత్రం ‘ఉరుకు పటేల’

Uruku patela: హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించిన తేజస్‌ కంచర్ల ప్రస్తుతం మరో మూవీకి సిద్ధమవుతున్నాడు. తేజస్‌ చేస్తున్న ‘ఉరుకు పటేల’ చిత్రం మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ని ఇటీవల మేకర్స్‌ రివీల్ చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌తో పాటు చిత్ర వివరాలను మూవీ బృందం వెల్లడించింది. ఈ పోస్టర్‌ను పరిశీలిస్తే, తేజస్‌ కంచర్ల పరిగెడుతుంటే అతని వెనుక ఎవరో కత్తిని విసిరేసినట్లుగా ఉంటుంది. మరో వైపు మంగళసూత్రం, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌, పాల క్యాన్‌ అన్నీ పోస్టర్‌లో కనిపిస్తాయి. ఇది పూర్తి గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలే ప్రధానంగా సాగే చిత్రమని ఈ ఫస్ట్‌‌ లుక్‌ పోస్టర్‌ పరిశీలిస్తే అర్థమవుతోంది.

ఈ పోస్టర్‌ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయనే దానికి సింబాలిక్‌గా పోస్టర్‌ను డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అలాగే ఈ టైటిల్‌కు మాదిరిగానే.. సినిమా సైతం ఉరుకు అన్నట్లుగా ఉంటుందనేలా ఈ ఫస్ట్‌ లుక్‌ ద్వారా స్పష్టమవుతోంది. లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ ‘ఉరుకు పటేల’ మూవీని తెరకెక్కిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్‌ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *