Nani janhvi: ‘దసరా’ సినిమా కాంబోలో మరో మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి మరో మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయంపై ఇంకా స్పందించకపోయినా జాన్వీ నటించడం ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం జాన్వీకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో రెండు భారీ మూవీస్‌లో చాన్స్ కొట్టేసింది. అయితే ఇప్పటికీ ఏదీ థియెటర్లలో విడుదల కాలేదు. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమాలోనూ జాన్వీ కథానాయికగా నటిస్తున్నారు. ‘పుష్ష 2’లో ఐటమ్ సాంగ్ కోసం జాన్వీ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు నాని అభిమానులు మరో టాక్ ముందుకు తీసుకొచ్చారు.
నాని పక్కన జాన్వీ ఏమిటన్నది నాని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘నాని అన్నా.. నీకు జాన్వీ సెట్ కాదు..’ అంటూ ఫ్యాన్స్ బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జాన్వీ అక్కలా ఉంటుందని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ‘దసరాలో కీర్తి సురేశ్‌తో నీ జోడీ బాగుంది కదా, తననే తీసుకోండి’ అంటూ సలహా సైతం ఇస్తున్నారు. ‘హాయ్ నాన్న’లో మృణాల్ విషయంలో తప్పు చేశాడన్నది నాని ఫ్యాన్స్ వాదన. ఆ సినిమాలో మృణాల్‌తో నాని కెమిస్ర్టీ మిస్ మ్యాచ్ అయ్యిందని, నాని పక్కన మృణాల్ వయసు ముదిరిన పిల్లలా కనిపించిందన్న కామెంట్లు గుప్పుమన్నాయి. జాన్వీ విషయంలోనూ అదే జరుగుతుంది ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి నేచురల్ స్టార్ నాని దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.