Navodaya: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025 -26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు తప్పనిసరిగా ఉమ్మడి జిల్లాల పరిధికి చెందిన వారై ఉండాలి. 2013 మే 01 నుంచి 2017 జూలై 31వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. 3, 4, 5 తరగతులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 2024 సెప్టెంబర్ 16వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష 2025 జనవరి 18వ తేదీన నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించవచ్చు.