- భద్రత లేని బడి బస్సుకు రేకు కొట్టారు
SCHOOL BUS EFFECT: బడి పిల్లల బస్సుకు రేకు వచ్చింది. బస్సు వెనుక అద్దం బిగించాల్సిన చోట రేకు కొట్టి పసుపురంగు పూసి చేతులు దులుపుకుంది పాఠశాల యాజమాన్యం. ఏప్రిల్ 8 న ‘మన బలగం’ దిన పత్రికలో ‘భద్రత లేని బడి బస్సు’ పేరిట వార్తా కథనం ప్రచూరితమైంది. దీనికి పాఠశాల యాజమాన్యం మా అనుమతి లేకుండా.. ఆర్టీఏ అధికారుల వివరణ లేకుండా వార్త ఎలా ప్రచురిస్తారని రాసిన విలేకరికి బెదిరింపుల కాల్స్‌తో విఫలయత్నం చేశారు. మేము నడుపుతున్నవి ‘మావి డొక్కు బస్సులే కావు.. ’భద్రత లేదని’ మీరెలా డిసైడ్ చేస్తరూ.. కావాలంటే ఆర్టీఏ అధికారులను అడిగి తెలుసుకోండని చెబుతూనే అద్దం బిగించాల్సిన చోట రేకును కొట్టి పసుపు కలరేసి కవర్ చేసుకున్న దృశ్యం మళ్లీ ‘మన బలగం’ కెమెరాకు చిక్కింది. ఇదీ వేల రూపాయల ట్రాన్స్ పోర్ట్ ఫీజులు కట్టిన విద్యార్థులపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చూపుతున్న శ్రద్ధ. ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు.. ఆదమరిచి నిద్దరోతున్న ఆర్టీఏ అధికారులు మేల్కోకపోతే ఏదోక రోజు ప్రమాదాలకు గురికాక తప్పదని స్థానికంగా ముచ్చటించుకుంటున్నారు.