సిరికొండలో సిత్రమైన రావిచెట్లు.!!
Ravi tree: ప్రతీయేటా వచ్చే.. హనుమాన్ జయంతిలోపు.. ఆ ఊరి రావిచెట్లు రెండురంగుల్లో చిగురించి దారినపోయే
చూపరుల మనసు దోచుకుంటుంటాయ్. ఎండాకాలం.. అందులోనూ ఆకురాల్చుకాలంలో
ఎండిన ఆకులు రాలి.. కొత్త చిగుర్లు తొడగడం.. వసంతంలో సర్వసాధారణం. అదేంటో ఈ వింత.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో.. కోరుట్ల – వేములవాడ రహదారిపై బస్టాండ్ పక్కన పంచముఖాంజనేయస్వామి గుడి ఆవరణలో పెరిగిన రెండు రావిచెట్లు మాత్రం రెండు రంగుల్లో కొత్త చిగురాకులతో ముస్తాబవుతాయ్. ఇదే ఇక్కడి వింత. ఒకేసారి.. ఆకులన్ని రాలినా.. ఒకచెట్టు నారింజ రంగులోనే ఆకులు చిగురిస్తే. ఇంకోచెట్టు యథావిధిగా ఆకుపచ్చ రంగులో చిగురిస్తుంది. ఏది ఏమైనా ఇలా చిగురించడం. పంచముఖుడి మహత్యమై ఉంటుందని ఆ ఊరి భక్తుల నమ్మకం.