Telangana Building Construction Workers Union: కరీంనగర్, డిసెంబర్13 (మన బలగం): పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ( ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో శుక్రవారం మంకమ్మతోటలోని జిల్లా లేబర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పెండింగ్ సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ పెండింగ్ ఫైళ్ల డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. ఆన్లైన్ సర్వీసెస్ డేటా ఎనిమిదో నెల తొమ్మిదో నెలలో అప్లై చేసిన క్లెయిమ్స్ తిరిగి మరల చేయాలని కమిషనరేట్ నుంచి చెప్పడం కొంతమంది రెన్యువల్ ల్యాబ్ అయినవారు ఆందోళన చెందుతున్నందున తక్షణమే అందరికీ వచ్చేట్లుగా చర్యలు తీసుకోవాలని కోరారు. బోర్డులో యూనియన్ వారిని ఇద్దరిని మెంబర్లుగా తీసుకోవాలన్నారు. మెడికల్ పేరుమీద టెస్టులతో దాదాపు రూ.2,200 ఒక సభ్యునికి వద్ద డబ్బులు తీసుకోవడం రద్దు చేసి కార్మికుల డబ్బును తిరిగి చెల్లించాలన్నారు.
వెంటనే ఈ పద్ధతిని నిలుపుదల చేయాలన్నారు. సెస్ 2% వసూలు చేయాలని, ప్రతి కార్మికులకు రూ.5000 55 సంవత్సరాలు నిండిన వారికి ఇవ్వాలని, నిరుపేద కార్మికులకు పనిముట్లతో సహాయ సహకారాలు అందించి లోన్ సౌకర్యం సబ్సిడీతో ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిరుపేదలకు ఇవ్వాలని లేబర్ ఆఫీస్ ప్రతి సెక్షన్లో ఖాళీలను భర్తీ చేయాలని, ఆధార్ అప్డేట్ ఇతర సమస్యలను ఏఎల్ఓలకే పూర్తి అధికారం ఇవ్వాలని వారు కోరారు. ఓబీసీ డబ్ల్యూ కార్డు నమోదు అయిన సంవత్సరం కాకుండా నమోదు అయిన తేదీ రోజు నుంచే పథకాలు అమలు చేయాలని, కేంద్ర కార్మిక చట్టాల్లో ఉన్న పెన్షన్, స్కాలర్షిప్, ఇండ్లు పనిముట్ల లోన్ కార్మికులకు వెంటనే ఇవ్వాలన్నారు. నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేసిన సెస్ నిధులను దుబారా పై విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా నాయకులు పిట్టల రామస్వామి, గోదారి లక్ష్మణ్, తిరుపతి, కులాని తిరుపతి, ఎండి రజాక్, ఎండీఏ బాస్, శనిగరం నరేశ్, గామినేని సత్యం, రమేశ్, లక్ష్మణ్ యాదవ్, కత్తి రాములు, ఎల్లయ్య, నలువాల సమ్మయ్య, సందెల శ్రవణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.