CM Cup
CM Cup

CM Cup: అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి గ్రామీణ క్రీడలు దోహదపడతాయి: జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

CM Cup: నిర్మల్, డిసెంబర్ 17 (మన బలగం): గ్రామీణ స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగడానికి సీఎం కప్ తోడ్పడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ అన్నారు. మంగళవారం నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రారంభించిన బ్యాడ్మింటన్ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు జాతీయ స్థాయి వెళ్లేలా సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. యువత చదువుతోపాటు క్రీడలలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడామైదానంలో రెండో రోజు క్రీడా పోటీలను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. బాక్సింగ్, హ్యాండ్ బాల్, నెట్ బాల్, చెస్, తైక్వాండో, కారాటే, ఆట్యా పాట్యా, ఎన్ఎస్ఏ అకాడమీలో బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా దాదాపు 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ రవీందర్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి భోజన్న, వ్యాయామ ఉపాధ్యాయులు భూమన్న, బుచ్చి రామారావు, రమణారావు, స్వామి, భూమేష్, జమున, విజయలక్ష్మి, రాజేందర్ ,కవిత, సంజీవ్, సాయిరాజ్ ముఖేశ్ తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *