Set conference: నిర్మల్, డిసెంబర్ 21 (మన బలగం): సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణ, నీతి, నిజాయితీతో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. కొత్తగా పోలీస్ స్టేషన్‌కు పంపిన వారి డ్యూటీల గురించి రివ్యూ నిర్వహించారు. సమయపాలన పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలి అనే అంశాలు వివరించారు. మెన్, ఉమెన్ అని తేడా లేకుండా విధులు నిర్వహించాలని, పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. విధులు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. జాయినింగ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేర్చుకున్న విధుల గురించి వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సెట్ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఐటీ, డీసీఆర్బీ, మరియు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.