Playing Cards
Playing Cards

Playing Cards: జాతర ముసుగులో పేకాట

  • గోదావరి జిల్లాలను తలపించేలా సెట్టింగులు
  • మహారాష్ట్ర సరిహద్దులో శిబిరాలు
  • భగ్నం చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు

Playing Cards: నిర్మల్, జనవరి 16 (మన బలగం): జాతర ముసుగులో జోరుగా పేకాట, మద్యం ఏరులై పారింది. గోదావరి జిల్లాలను తల్లిదన్నే రీతిలో భారీ సెట్టింగులను వేసి అక్రమ వ్యవహారాలను ప్రోత్సహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు అందిన సమాచారం మేరకు ఏఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో మహారాష్ట్ర సరిహద్దులోని సారంగాపూర్ మండలం బండరేవు తండాలో మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో అక్రమ వ్యవహారానికి తెరపడింది. ఇప్పటికే జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న జూదంపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పెట్రేగిపోయిన పేకాటరాయుళ్లను అరికట్టేందుకు ప్రత్యేకంగా జిల్లాలో పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచారు. ఆ మేరకు మూడు బృందాలతో జూదం ఆడే ప్రదేశాలను గాలిస్తూ జూదాన్ని అరికట్టే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సారంగాపూర్ మండలం బండ రేవు తాండాలో జరుగుతున్న నానోజీ మహారాజ్ జాతరలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా నేతృత్వంలో దాడులు చేశారు.

జాతరకు వంద మీటర్ల దూరంలో ఎవరికీ అనుమానం రాకుండా ఆట బొమ్మలు వివిధ సామాన్లు అమ్మే విధంగా దుకాణాల మాదిరిగా టెంట్లు వేసి పేకాట ఆడుతున్నారు. పోలీసులు చాకచక్యంగా వీటిని గుర్తించి దాడులు చేశారు. ఒకవేళ పోలీసుల ప్రవేశం జరగకపోతే కోట్లలో రూపాయల జూదం జరిగేదని సమాచారం. మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పేకాట రాయుల్లు మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో పేకాట ఆడతారని సమాచారం. కోట్లలో రూపాయలు చేతులు మారుతాయని తెలుసుకున్న పోలీసులు జూదరులను అరికట్టారు. పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేశారు. జూద మాడకుండా దాడులు చేయడంతో జూదరులు తమ తమ ప్రదేశాలను ఖాళీ చేసే వెళ్లిపోయారు. కొందరు టెంట్లను వదిలి పారిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న పేకాట ఆడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భక్తి, భావం మధ్య జాతరను జరుపుకోవాలి తప్ప జూదంతో కాదని సూచించారు. పండుగలను అడ్డం పెట్టుకొని జూదమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామస్తులు సైతం జూదమును ప్రోత్సహించ వద్దని సూచించారు.

Playing Cards
Playing Cards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *