Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల రాశిఖన్నా ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలివుడ్ బాట పట్టిన ఈ భామ సూపర్ సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. పెద్ద సినిమాల కోసం కాసుక్కూర్చోకుండా వచ్చిన ఆఫర్స్‌ను ఒడిసి పట్టుకుంటోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది.
తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసిన ఈ బ్యూటీకి రాను రాను ఆఫర్స్ తగ్గిపోయాయి. తెలుగులో యంగ్ హీరోలతో జతకట్టి ఆడియన్స్‌ను మెప్పించింది. మరోవైపు తమిళంలోనూ చాన్సులు కొట్టేసింది. ఎన్టీఆర్ మూవీ జై లవకుశలో కనిపించినా ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. కాగా తనకు ఆఫర్ వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు రెడీ అంటూ హింట్ ఇస్తోంది. మరోవైపు యంగ్ హీరోయిన్స్‌కు పోటీగా రాశీఖన్నా గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవల ఈ భామ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. కుర్రకారు మతిపోతోంది. తన అందాల ఆరబోతతో యూత్‌కు నిద్రపట్టకుండా చేస్తోంది. కాగా తాజాగా రాశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కమర్షియల్ చిత్రాల కన్నా కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించడం తనకు ఇష్టమని స్పష్టం చేసింది. తనకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టమని పేర్కొంది. కమర్షియల్ సినిమాల చాన్స్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పేసింది. అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా టైముందని చెప్పుకొచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయని పేర్కొంది. తాను నటిగా ఎదగాలని కోరుకుంటున్నానని, మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని అంటోంది. తనను తాను నటిగా ప్రూవ్ చేసుకునే చాన్స్ లభిస్తుందని వెల్లడించింది. అలాంటి సినిమాలనే తాను ప్రిఫర్ చేస్తానని స్పష్టం చేసింది.