Vasishtha High School Principal Gollapelli Madhavi receives Guru Brahma Award: నిర్మల్ పట్టణంలోని వశిష్ట హైస్కూల్ ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవికి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025-26 గాను గురు బ్రహ్మ అవార్డును స్థానిక వశిష్ట హైస్కూల్ ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవికి ప్రదానం చేశారు. విద్యారంగంలో చేస్తున్న కృషికి గాను తనలో ఉన్న నైపుణ్యాలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.
