- పోటీకిసై అంటున్న యువకులు
- పరేషాన్లో పాతతరం
Youth momentum in Nirmal district local elections: స్థానిక రాజకీయం రసవంతరంగా మారుతుంది. పాత తరం నాయకులతో విసిగెత్తిన ఓటరు ఈ తరం నాయకులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో రోజురోజుకు సమీకరణలు మారుతున్నాయి. ప్రధానంగా ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే నాయకులకు అవకాశం ఇచ్చేందుకు ఓటరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నిస్వార్థంగా సేవ చేసే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
జెడ్పీటీసీ పైనే యువత గురి
స్థానిక సమరంలో జెడ్పీటీసీ స్థానంపైనే యువత గురి పెట్టారు. రిజర్వేషన్స్ అనుకూలం ఉన్న ప్రతీ చోట యువత పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్యంగా యువత పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తే ఓకే, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో మొత్తం 18 జెడ్పీటీసీ స్థానాలు
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో రిజర్వేషన్ల వారీగా క్రింది విధంగా ఉన్నాయి. బాసర బీసీ మహిళ, తానూర్ ఎస్సీ జనరల్, భైంసా ఎస్సీ మహిళ, లక్ష్మణచాంద ఎస్సీ జనరల్, సోన్ బీసీ మహిళ, కుంటాల బీసీ జనరల్, నిర్మల్ బీసీ జనరల్, ముధోల్ బీసీ మహిళ, ఖానాపూర్ ఎస్టీ జనరల్, నర్సాపూర్ (జి) బీసీ మహిళ, లోకేశ్వరం బీసీ జనరల్, సారంగాపూర్ ఎస్టీ మహిళ, దస్తురాబాద్ బీసీ జనరల్, కుబీర్ జనరల్, దిలావర్పూర్ మహిళ, కడెం పెద్దూర్ ఎస్టీ జనరల్, మామడ అన్ రిజర్వుడు, పెంబి మహిళకు కేటాయించారు. మండలాల్లో రిజర్వేషన్ల వల్ల పోటీకి అనుకూలం లేని నాయకులు ప్రాబల్యం ఉన్న పక్క మండలాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సత్యం.. చంద్రకాంతే మా నేత
నిర్మల్ మండల జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నాయకులు, నిర్మల్ ఎమ్మెల్యే అనుచరుడు సత్యం చంద్రకాంత్ (చందు) పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సత్యం చంద్రకాంత్ దిలావర్పూర్ మండలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన నిర్మల్ మండలంలోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఆయనకు అనుచర గణం ఉండడం వల్ల వారి మద్దతుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితునిగా ఉండటం, రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ తరపున ఆయన బరిలో ఉంటారని ప్రచారం ఇప్పటినుండే జరుగుతోంది. యువ నాయకుడు, ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉండడంతో ప్రజలు సైతం ఆయనకు మద్దతు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఆయన ఇప్పటినుండే చాప కింద నీరులా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న వారిని గ్రామాల వారీగా కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతి ఊరిలోనూ ఆయనకు అనుకూల వాతావరణం కనిపించడంతో దాదాపు ఆయనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు.
కుంటాల బరిలో జుట్టు అశోక్
కుంటాల మండల జెడ్పీటీసీ స్థానానికి జుట్టు అశోక్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలువనున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, రాజకీయ అనుభవం కలిగిన అశోక్‌కు అవకాశం కల్పించినట్లయితే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మండల ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన జుట్టు అశోక్ అణగారిన వర్గాల ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు. దీంతో ఆయనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రైతు నేత రాజేందర్‌కు మద్దతు
పాత్రికేయ వృత్తిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హపావత్ రాజేందర్ ప్రజా సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్రను పోషిస్తూ అంచలంచలుగా ఎదిగాడు.ప్రజా నాయకుడు, రైతు నేత హపావత్ రాజేందర్ కడెం మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కడెం మండల రైతుల సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పది లపరుచుకున్నాడు. జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి నుంచి తన ప్రచారాన్ని మండలంలో విస్తృతంగా నిర్వహిస్తున్నాడు. ప్రతి ఊర్లోను ప్రజలు ఆయనను ఆప్యాయంగా స్వాగతిస్తూ నీవే ఈ మండలానికి సరైన నాయకుడివంటూ సన్మానాలు చేస్తున్నారు.