CPO inspection of polling stations in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది, ఎర్వచింతల్ గ్రామాల్లో మంగళవారం సీపీవో జీవరత్నం, ఎంపీవో రత్నాకర్ రావ్ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్వరలో జరిగే ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ముందస్తుగా పోలింగ్ స్టేషన్లను పరిశీలించామని, పోలింగ్‌కు అనువుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తామని అన్నారు.
