Komaram Bheem Vardhanti celebrations in Lokeshwaram: కొమురం భీమ్ 85వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంతోపాటు నగర్, బిలోలి, రాజూరా తదితర గ్రామాల్లో నాయక్ పోడ్ సంఘం ఆధ్వర్యంలో భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయక్పోడ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ.. భీమ్ వర్ధంతి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో కొమురం భీమ్ ఆదివాసుల తరపున అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. అదేవిధంగా మనం కూడా మన హక్కుల సాధనకై ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకపోడ్ సంఘ మండల అధ్యక్షుడు అట్టోలి రాజేశ్వర్, గోనేటి జగదీశ్, సంఘ సభ్యులు మెట్టు నరేశ్, నముల్ల భోజన్న, కాందారి సతీశ్, వడ్ల శాంతి, గడ్డం మహేశ్, గడ్డం శ్రీనివాస్, గడ్డం సాగర్, గడ్డం బచ్చన్న, గడ్డం భాస్కర్, పొలాస సాయిలు, గడ్డం సాయిలు పాల్గొన్నారు.
