Distribution of study material
Distribution of study material

Distribution of study material: పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

Distribution of study material: నిర్మల్, డిసెంబర్ 13 (మన బలగం): లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పీఆర్టీయూ (టీఎస్) జిల్లా అధ్యక్షులు, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు తోట నరేంద్ర బాబు శుక్రవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి ఉన్నతంగా ఎదుగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మంచి క్రమశిక్షణ అలవర్చుకొని అందరికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *