households survey: ఇబ్రహీంపట్నం, నవంబర్ 13 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబాల సర్వేకు ప్రజలు సహకరించాలని జగిత్యాల జిల్లా డీఆర్డీఏ పీడీ, ఇబ్రహీంపట్నం మండల ప్రత్యేక అధికారి రఘువరన్ కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఐదో రోజు కుటుంబాల సర్వే కొనసాగింది. ఆయన ఇబ్రహీంపట్నంలో సర్వేను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు చేస్తున్న సర్వే పనితీరును పరిశీలించి అనంతరం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేటర్లకు సహకరించాలని, వారు అడిగే 75 ప్రశ్నలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే అధికారులకు ఎలాంటి జిరాక్స్లు గాని, ఓటీపీలు గాని ఇవ్వాల్సిన పనిలేదని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, ఆయా గ్రామాల సూపర్వైజర్లు,ఇన్యూమరేటర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.