Rajita assumed charge as DMHO: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ రజిత నియామకం అయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎఫ్.ఏ.సీ.గా ఉన్న డాక్టర్ వసంత రావు స్థానంలో డాక్టర్ రజిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.