food day
food day

food day: ధూళిమిట్ట ఉన్నత పాఠశాలలో ఆహార దినోత్సవం

food day: మనబలగం, సిద్దిపేట ప్రతినిధి: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దూళిమిట్ట మండల కేంద్ర ఉన్నత పాఠశాలలో ప్రతి నెలా నిర్వహిస్తున్న పేరెంట్ టీచర్స్ సమావేశంలో (పి.టి.ఎం)లో భాగంగా శనివారం తెలంగాణ ఆహార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఆహారోత్సవం (ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఎదుగుతున్న దశలో పోషక విలువలతో కూడిన పౌష్టికాహారము అందించడం చాలా ముఖ్యమని, శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్స్ అవసరమని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ఆయా తరగతుల విద్యార్థినీ, విద్యార్థుల తల్లులు స్వయంగా తయారుచేసిన నవ్వుల కాజు లడ్డూ, పల్లిపట్టి, మిక్స్‌డ్ వెజిటేబుల్ రైస్, సర్వపిండి తదితర పౌష్టిక ఆహార పదార్థాలను ప్రదర్శించిన అనంతరం సంబంధించిన పోషక విలువల గురించి వివరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు చిలుక వెంకటయ్య, కక్కెర్ల నాగరాజు, మానుక శ్రీనివాస్, వంగ శ్రీనివాస్ రెడ్డి, ఇర్రి రాజిరెడ్డి, గొట్టిపర్తి భాస్కర్, నాగులపల్లి రాములు, నిమ్మ సురేందర్ రెడ్డి, పిడిశెట్టి నరేష్, వెగ్గలం సతీశ్ కుమార్, సుద్దాల రంజిత్ కుమార్, యామ రాజు, ఉపాధ్యాయినులు కాంపెల్లి సమత, సందిటి సులోచన, రికార్డ్ అసిస్టెంట్ మల్లం సత్యనారాయణ, ఆఫీసు సబార్డినెట్ సిరబోయిన రమేష్, ఆయా లక్ష్మీ, పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *